అనుమతి లేకుండా నడిపిస్తున్న పాఠశాలను సీజ్ చేసిన విద్యా శాఖ అధికారులు.

ఎన్ టుడే న్యూస్ ప్రతినిధి — కూనురు మధు

వనస్థలిపురంలో విద్యాశాఖ అనుమతి లేకుండా నడుస్తున్న లిటిల్ చెర్రీస్ స్కూల్ సీజ్ చేసిన మండల విద్యాశాఖ అధికారి.

హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకు అనేక అక్రమ పాఠశాలల పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నాయి. ప్రభుత్వ అనుమతులు లేకుండానే పెద్ద పెద్ద భవనాలలో, రంగురంగుల బ్రోచర్లు తో ప్రభుత్వ గుర్తింపు ఉన్నట్టు చూపిస్తూ, తల్లిదండ్రులను మోసం చేస్తూ, అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఇదే కోవాకు చెందిన రంగారెడ్డి జిల్లా, హయత్ నగర్ మండలం వనస్థలిపురం FCI కాలనీలో లిటిల్ చెర్రీస్ స్కూల్ యాజమాన్యం ప్రభుత్వ అనుమతి లేకుండానే అడ్మిషన్లు తీసుకుంటూ, తల్లిదండ్రుల నుండి లక్షల్లో ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నారని తెలుసుకున్న తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు షేక్ షబ్బీర్ అలీ విద్యాశాఖ అధికారులకు తగిన ఆధారాలతో ఫిర్యాదు చేయడం జరిగింది. టిపిటిఎఫ్ ఫిర్యాదును అందుకున్న విద్యాశాఖ అధికారులు లిటిల్ చెర్రీస్ పాఠశాలను వెంటనే మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఉన్నత అధికారుల ఆదేశాలు అందుకున్న మండల విద్యాశాఖ అధికారి లిటిల్ చెర్రీ స్కూల్ ను శుక్రవారం సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ గారు మాట్లాడుతూ ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలో విద్యార్థులను చేర్పించవద్దని, విద్యార్థులను పాఠశాలలో చేర్పించేటప్పుడు ఆ పాఠశాలకు గుర్తింపు ఉందా..? లేదా..? అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే విద్యార్థులలో ఆయా పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top