కీ.శే సాంబరాజు రవి కుటుంబానికి 1,09,725 రూ.ల ఆర్థిక సహాయం

తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి

రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక సహాయం చేసిన కమిటీ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు – గోపి రజక

సాంబరాజు భావన పేరుపై లక్ష రూ.లు ఫిక్స్డ్ డిపాజిట్, సాంబరాజు దివ్యకు 9725 రూ.ల క్యాష్ అందజేత

ఎన్ టుడే న్యూస్ మునుగోడు ప్రతినిధి – కుర్మతి రమేష్

జనగామ జిల్లా జాఫర్ ఘాట్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి జాతీయ, రాష్ట్ర కమిటీలు వెళ్లి తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి మాజీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కీ.శే సాంబరాజు రవి కూతురు భావన పేరుపై ఒక లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన చెక్ ను అందజేయడం జరిగింది. అదేవిధంగా మిగిలిన అమౌంట్ భార్య కు సాంబరాజు దివ్యకు 9725 రూ.లు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక సహాయం చేసిన వారి పేర్ల వివరాల జిరాక్స్ సెట్ ను అందజేయడం జరిగింది. 1,09,725 రూ.లు తెలంగాణ రాష్ట్రంలో ఇంత వరకు ఏ సంఘం చేయలేని విధంగా పెద్దఎత్తున ఆర్థిక సహాయం చేసిన ఏకైక సంఘంగా తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి చరిత్రలో నిలిచిందని గోపి రజక అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక సహాయం చేసిన నేషనల్ ధోభి రిజర్వేషన్ సంఘ, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి కమిటీ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసిన జాతీయ కన్వీనర్ నడిమింటి శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక కీ.శే సాంబరాజు రవి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని కమిటీ తెలియజేస్తూ రవన్న చేసిన సేవలను స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఈసందర్భంగా గోపి రజక అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ అశోక్, సూరారం మాజీ సర్పంచ్ మేడిపల్లి శ్రీనివాస్, చాకలి ఐలమ్మ మనుమడు చిట్యాల రామచంద్రం, సంపత్ సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు రాపర్తి సోమన్న, నేషనల్ ధోబీ రిజర్వేషన్ సంఘ జాతీయ ఉపాధ్యక్షులు ఉల్లెంగల యాదగిరి, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు సాంబరాజు కుమార్, మిన్నలపురం జలేంధర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏదునూరి వీరన్న, కళామండలి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యామంకి యుగేందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉల్లెంగుల యాదగిరి, మాజీ సర్పంచ్ జనగామ జిల్లా గౌరవ అధ్యక్షులు రాపర్తి యాకన్న, జిల్లా అధ్యక్షులు ఏదునూరి నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిపాక రాములు, జిల్లా కార్యదర్శి ఉల్లెంగుల రాజు, జిల్లా ముఖ్య సలహాదారు మెంతన కిష్టయ్య, మరియు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు రాజకీయ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top