డా.బూర నర్సయ్య గౌడ్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని

ఎన్ టుడే న్యూస్ మునుగొడు ప్రతినిధి – కుర్మతి రమేష్

సంస్థాన్ నారాయణపురం మండలంలో అల్లందేవి చెర్వు
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు జన జాగరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మండల పరిధిలో ఉన్న దాదాపు అన్ని గ్రామాలలో గడప గడపకు BJP ఈ కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజలకు నరేంద్ర మోడీ ఇస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఆయా గ్రామాలలోని ప్రతి ఇంటికి వెళ్లి డోర్ స్టిక్కర్, కరపత్రం అందించి నరేంద్ర మోడీ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి మన భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి అయిన డా.బూర నర్సయ్య గౌడ్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిస్తూ ఆ గ్రామాలలో మోడీ అందించిన పథకాల లబ్ధిదారులను కలిసి వారి సెల్ఫోన్ ద్వారా 9638002024 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇప్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా తన స్వగ్రామమైన అల్లందేవిచెర్వు గ్రామంలో పాల్గొన్న BJP మండల పార్టీ అధ్యక్షులు సుర్వి రాజుగౌడ్ ఉపాధి హామీ కూలీలను కలిసి, వారి యొక్క ఉపాధిహామి డబ్బులను నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం నేరుగా కూలీల కాతాలలోనే జమ చేస్తున్నదని అంతే కాకుండా ఇటీవల ఉపాధి హామీ కూలీల వేతనాన్ని 300 రూపాయలకు పెంచాడని, దానితో పాటుగా మోడీగారు ఉచితంగా ఇస్తున్న రేషన్ బియ్యం గురించి, కరోనా కష్టకాలంలో ఇచ్చిన ఉచిత వాక్సిన్ల గురించి, మరియు గ్రామపంచాయతీలకు కేంద్రం ఇస్తున్న నిధుల గురించి వివరిస్తూ ఉపాధి హామీ కూలీలు చేస్తున్న పనిలో సుర్వి రాజుగౌడ్ పాలుపంచుకొని, నరేంద్ర మోడీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ని అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు సుర్వి సురేష్ గౌడ్, మండల నాయకులు గుండు రాజుగౌడ్, సుర్వి లింగస్వామి గౌడ్, అంతటి శివశంకర్ గౌడ్, ముక్యర్ల లింగస్వామి యాదవ్, BJYM మండల ఉపాధ్యక్షులు సుర్వి వినయ్ గౌడ్, BJYM మండల సోషల్ మీడియా కన్వీనర్ గుండు నవీన్ గౌడ్, సుర్వి వెంకటేష్ గౌడ్, దాసరి జంగయ్య యాదవ్, గుండు జంగయ్య గౌడ్, సుర్వి శేఖర్ గౌడ్, గుండు లింగస్వామి గౌడ్, సుర్వి శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top