పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజల పక్షాన పోరాడే బిఆర్ఎస్ అభ్యర్తి ఎనుగు రాకేష్ రెడ్డిని గెలిపించాలి

బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పూల వెంకటేశం

ఎన్ టుడే న్యూస్ మునుగోడు ప్రతినిధి – కుర్మతి రమేష్

వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఎమ్మెల్సీఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుక అభ్యర్తి ఎనుగు రాకేష్ రెడ్డిని ఎమ్మెల్సీ అత్యధిక మెజార్టీతో శాసనమండలికి పంపియవలసిన బాధ్యత మేధావులు విద్యావంతులు మహిళలు ప్రతి ఒక్కరూ ఆదరించి గెలిపించగలరని పూల వెంకటేశం తెలిపారు. విద్యావంతుడు బిట్స్ పిలాని లో గోల్డ్ మోడల్ సాధించి అమెరికా పేస్బుక్ సిటీ బ్యాంక్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలలో పనిచేసి అన్ని విధాలుగా తెలిసిన వ్యక్తి నిరుద్యోగ యువత సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వారికి అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించడం ముందుకు సాగుతున్నారు. ఈ గడ్డపై పుట్టిన బిడ్డకు ఓట్లు వేసి అత్యధికంగా గెలిపించి ఈ గడ్డ రుణం తీర్చుకోవాలని మరిన్ని అవకాశాల కోసం ముందుకొస్తున్న విద్యావంతుడు మేధావి రాకేష్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించగలరని కోరుతున్నాం మేధావులు ఆలోచన చేసి ప్రజల పక్షాన నిలబడి పోరాడే వ్యక్తులకు గుర్తించి ఓటు వేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిందని ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. పట్టాభద్రుల ఎన్నికలు కనుక మంచి ఆలోచనతో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగు రాకేష్ రెడ్డిని ఓటు వేయాలని తెలిపారు. నాడు అధికారంలో ఉన్న బిఆర్ఎన్ పార్టీ రాష్ట్రంలో 1.60 వేల ఉద్యోగాలు ఇచ్చిందని అప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు కాంగ్రెస్ ఉద్యోగ పట్టాలు ఇచ్చి తానే ఇచ్చినట్లు చెప్పుకోవడం సిగ్గు చేటని విమర్శించారు. కేంద్రంలో మోడీ ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఉన్న ఉద్యోగాలను ఉడగోట్టారని అన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేసే కుట్ర చేస్తున్నారని పేర్కోన్నారు. నిరుద్యోగుల ను మోసం చేసే కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులను ఓడించి, ఎమ్మెల్సీ అభ్యర్తి ఎనుగు రాకేష్ రెడ్డి 3వ నెంబర్ పై తమ అమూల్యమైన ప్రధమ ఓటు వేసి గెలిపించాలని పట్టా బద్రులను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top