పార్టీకి నష్టం కలిగించే వారిపై క్రమ శిక్షణా చర్యలు తప్పవు -మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల బిక్షంగౌడ్

ఎన్ టుడే న్యూస్ మునుగోడు ప్రతినిధి – కుర్మతి రమేష్

భారతీయ జనతా పార్టీ మండల పదాధికారుల సమావేశం మండల పార్టీ అధ్యక్షుడు సుర్వి రాజు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఈ నెల 27 న జరగబోయే పట్టభద్రుల MLC ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించడం కోసం బూత్ కో ఆర్డినేటర్, ఓటర్ ప్రణాళిక బద్ధంగా ప్రతి ఓటరును కలిసే విధంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించడం జరిగింది.
ఈ రోజు కొన్ని దినపత్రికల్లో బిజెపి పార్టీ ప్రతిష్టను దిగజార్చడం కోసం దురాలోచనతో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనూరు వీరారెడ్డి పై, మండల అధ్యక్షుడు సుర్వి రాజు గౌడ్ పై అసత్య, అనాలోచిత ప్రకటన చేసిన ఆత్కూరి రాములు పై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా పార్టీకి తీర్మానించి జరిగింది అలాగే ఇక నుండి పార్టీ నాయకులు ఏ స్థాయి వారైనా అసత్య ఆరోపణలు చేసిన పార్టీకి వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించిన అట్టి వారిపై కూడా చర్యలు తీసుకొనుటకు సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించడమైనది. బీజేపీ నీ బ్రష్టు పట్టించాలని కాంగ్రెస్, టిఆర్ఎస్ రాజకీయ నాయకుల పత్రికలు ఎలాంటి అక్రిడేషన్ కార్డులు లేకుండా అసత్య వార్తలు వ్రాసే వారిపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని తీర్మానించడమైనది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనూరు వీరారెడ్డి, మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షం గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు నందగిరి జగత్ కుమార్ గారు మండల పార్టీ అధ్యక్షుడు సుర్విరాజ్ గౌడ్ గారు, ప్రధాన కార్యదర్శులు బండమీది కిరణ్, కుర్ర శంకర్ చౌహన్, ఉపాధ్యక్షులు కుకుడాల మహేందర్ రెడ్డి, సంపత్ సుధాకర్ రెడ్డి, ఆరుట్ల వెంకటేష్ యాదవ్, కట్కూరి లక్ష్మీ వెంకటేష్ గౌడ్, కార్యదర్శులు బూస శ్రీను, జక్కర్తి నరసింహ, సూరపల్లి సరిత జవహర్, సంగిశెట్టి లక్ష్మీనారాయణ, ఊడుగు నాగరాజుగౌడ్, వీరమల్ల జంగయ్య, సుర్వి వెంకటేష్ గౌడ్, ఆంగోతు హతీరాం నాయక్, ఈసం గణేష్, రాపర్తి ప్రదీప్ గౌడ్, అచ్చిని ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top