ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలి

ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి
ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి డిమాండ్

ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారి డిఇఓ జగన్మోహన్ గారికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు అనేక రకమైన సమస్యలతో నడుస్తున్నాయి ఫీజులు చెల్లించలేని పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించాలంటే కనీస మౌలిక సదుపాయాలు విద్యార్థులకు సరిపడా టీచర్లు గదులు మూత్రశాలలు లేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

తక్షణమే ప్రభుత్వం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 25 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయుటకు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలి అలాగే అటెండర్, స్కావెంజర్ స్లీపర్ వంటి పోస్టులను భర్తీ చేయాలని ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం

లేని పక్షంలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నం.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జగిత్యాల జిల్లా కార్యదర్శి అక్రమ్ ఉపాధ్యక్షులు మేకల సంజయ్ జిల్లా సహాయ కార్యదర్శి నాగరాజు రాహుల్ జగిత్యాల రూరర్ అధ్యక్ష కార్యదర్శులు మచ్చ నితిన్, తోట రాజేష్, నాయకులు తరుణ్, సతీష్ ప్రేమ్, శ్రీనివాస్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top