రాంలింగంపల్లి,రంగాపూర్ గ్రామాల ప్రజల జీవన మనుగడ ఎటువైపు?

N TODAY NEWS: బొమ్మలరామారం మండలం, జూన్ 15

యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం లోని రంగాపురం, రామలింగంపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న కెమికల్ కంపెనీలు, టైర్లను కాల్చే కంపెనీలతో గ్రామాల ప్రజల జీవన మనుగడకు ప్రమాదం పొంచి ఉన్నదని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కెమికల్ ఫ్యాక్టరీ, టైర్లు కాల్చే కంపెనీల నుండి వెలువడే పొగ దుర్వాసన ఎలాంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాలుష్య నియంత్రణ నివారణకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో కెమికల్ కంపెనీ, టైర్ల కంపెనీ యజమానులకు ఆడిందే ఆట పాడిందే పాటగా వారి ఇష్ట రాజ్యంగా ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా కంపెనీలు నడిపించడంతో ప్రజల ప్రాణాలతో చెలగాటలాడుతున్నారు, గ్రామపంచాయతీ కార్యాలయంలో కంపెనీలకు సంబంధించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరియు ఇతర అధికారులు ఇచ్చిన అనుమతుల గురించి గ్రామపంచాయతీ కార్యదర్శులను వివరణ కోరగా మా దగ్గర కెమికల్ కంపెనీకి సంబంధించిన రికార్డులు లేవు అని మరియు టైర్లు కాల్చే కంపెనీల సమాచారం మా దగ్గర లేవు అని చెప్పడం ప్రజల ప్రాణాలకు అధికారులు ఇస్తున్న విలువ ఏమిటో తెలుస్తుంది ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి కెమికల్, టైర్ల కంపెనీలపై విచారణ జరిపి కంపెనీ నుండి వెలువడే దుర్వాసనను అరికట్టే విధంగా తగు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top