శ్రీ శ్రీ శ్రీ బిరప్ప స్వామి కామరతి దేవిల బోనాల మహోత్సవంలో పాల్గొన్న బీసీ సంఘం నాయకులు

ఎన్ టుడే న్యూస్ మునుగోడు ప్రతినిధి – కుర్మతి రమేష్

మన్సూరాబాద్ లో కురుమ సంఘం ఆధ్వర్యంలో కురుమల కుల దైవం శ్రీ శ్రీ బీరప్ప స్వామి కామరాతి దేవిల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈరోజు బోనాల పండుగ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు మరియు కనకాల శ్యామ్ కురుమ బోనాల పండుగలు హాజరు కావడం జరిగింది. బీరప్ప దేవాలయ ట్రస్ట్ చైర్మన్ కర్ర శంకర్ కురుమ, ఆలయ అధ్యక్షుడు నర్రి రామలింగం, ఆర్గనైజేషన్ సెక్రెటరీ నర్రి లింగస్వామి కురుమ, శ్రీనివాస్ గౌడ్ కి కురుమ కండువా కప్పి సన్మానం చేయడం జరిగింది. బోనాల పండుగ సందర్భంగా మన్సూరాబాద్ పురవీధులు బోనాలతో ఒగ్గు కళాకారులచే సందడి నెలకొంది. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ కనకాల శ్యామ్ కురుమ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గణం నరసింహ కురుమలు ఒగ్గు డోలి కొట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ హైదరాబాదులో కూడా బీరప్ప స్వామి పండగ ఇంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని ఆ బీరప్ప దేవుని వేడుకున్నట్టుగా తెలియజేశారు. ఈ కార్యక్రమం లో కుల పెద్దలు, ట్రస్ట్ సభ్యులు, దేవాలయ ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top