హోలీ పండుగ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

బంజారాలతో హోలీ పండుగ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

N TODAY NEWS: తుర్కపల్లి మండలం, మార్చ్ 26

బంజారాలతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తుర్కపల్లి మండలం గిరిజనులు బంజారాలతో కలిసి హోలీ పండుగ సందర్భంగా వేడుకల్లో పాల్గొన్నారు.

రంగులు పూసుకొని బంజారాలతో కలసి నృత్యాలు చేస్తూ గల్లీ గల్లీ తిరుగుతూ వారి బాగోగులు తెలుసుకుంటూ వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు,బంజారాలు పాల్గొన్నారు.
ఈ సంధర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గ ప్రజలందరూ తన కుటుంబ సభ్యులేనని అన్నారు. ఆలేరు నియోజకవర్గం లోని గిరిజన సోదరులందరూ తనకు భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించాలని తెలిపారు. మీరందరూ ఓట్లు వేసి దీవిస్తే ఈరోజు మీ మధ్యలో హోలీ పండుగ ఆడుకునే అదృష్టం నాకు కలిగిందని అన్నారు, తుర్కపల్లి మండలం నాగాయపల్లి గ్రామం వెనుకబడిందని దీనికోసం మా గ్రామాన్ని అభివృద్ధి చేయమని గ్రామ యువకులు కోరగా వారందరికీ గెలవగానే అభివృద్ధి చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. పార్టీలకుతీతంగా హోలీ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషకరమని అన్నారు, నాగయపల్లి నుండి కర్కపట్ల రోడ్డు దగ్గరుండి వేయిస్తానని తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే మహిళలకు ఉచిత ఆర్టిసి ప్రయాణం,500 కే గ్యాస్,ఉచిత విద్యుత్ పథకాలను మొదటగా అమలు పరచడం జరిగిందని తెలిపారు. ఇక మీదట తండాలు గ్రామాలు అన్ని అభివృద్ధి చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top