సింగారం లో బిఆర్ అంబేడ్కర్,, జగ్జీవన్ రామ్ విగ్రహాల ఏర్పాటుకు శంకుస్థాపన

నల్గొండ జిల్లా మునుగోడు మండల పరిధిలో సింగారం గ్రామపంచాయతీ లో ఈరోజు సర్పంచ్ గుర్రాల పరమేష్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మరియు డాక్టర్ బాబు జగ్జీవన్ రావు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు . గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత అందరిపైనా ఉందని అంబేద్కర్ ఆశయాలను సాధించాలని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత భారతదేశంలో ప్రతి ఒక్కరు తలుచుకోవాల్సిన మహా మూర్తి అంబేద్కర్ అని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రపంచానికి మారదర్శకమని ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగమైన భారత దేశాన్ని ఔన్నత్యాన్ని కాపాడే విధంగా రాజ్యాంగం రచించిన మహా వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వట్టి వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ జిల్లా వెంకటేష్, కార్యదర్శి వై వేణు, కట్టమల్ల నారాయణరెడ్డి, వార్డు సభ్యులు గుర్రాల సురేష్, కోడి యాదయ్య, ఉప్పు తుల శ్రీశైలం, మేడి చంద్ర స్వామి, గుర్రాల సుఖేందర్, పిట్ట దయాకర్, గుర్రాల మణిదీప్, గుర్రాల మహేష్, ఉప్పుత్తుల ఉపేందర్ గ్రామ పెద్దలు విద్యావేత్తలు గ్రామ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *