ప్రశాంత వాతావరణంలో పారదర్శక ఎన్నికల ప్రక్రియకు ప్రతి ఒక్కరూ సహకరించాలి- యాదాద్రి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత్ కే. జండగే

ప్రశాంత వాతావరణంలో పారదర్శక ఎన్నికల ప్రక్రియకు ప్రతి ఒక్కరూ సహకరించాలి- యాదాద్రి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత్ కే. జండగే కోరారు.

N TODAY NEWS: యాదాద్రి భువనగిరి, మార్చ్ 17

ఆదివారం నాడు ఆయన డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేష్ చంద్ర, జిల్లా అదనపు కలెక్టర్లు పి. బెన్ షాలోమ్, గంగాధర్ లతో కలిసి జిల్లాలో పార్లమెంట్ సాధారణ ఎన్నికల నిర్వహణపై ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… భారత ఎన్నికల సంఘం పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ నిన్న విడుదల చేసిందని, మనకు నాలుగవ విడతలో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. వచ్చే ఏప్రిల్ 18వ తేదీన నోటిఫికేషన్, ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, ఏప్రిల్ 26 న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 29 న నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని, మే 13న పోలింగ్, జూన్ 4 న కౌంటింగ్ జరుగుతుందని, జూన్ 6వ తేదీన ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుందని తెలిపారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం సంబంధి సంబంధించి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇబ్రహీంపట్నం, మునుగోడు, భువనగిరి, నకరేకల్, తుంగతుర్తి, ఆలేరు, జనగాం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని తెలియజేస్తూ మొత్తం 2141 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయని, 8,94,789 మంది మహిళలు, 9,05,531 మంది పురుషులు, 78 మంది ఇతరులు కలిపి మొత్తము 18 లక్షల 398 ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఓటరుకు రెండు కిలోమీటర్ల పరిధిలో పోలింగ్ కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకున్నామని, అవసరమైన మేర బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వివి ప్యాట్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించిన నిన్నటి నుండి జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని, ఎన్నికల ప్రవర్తన నియమావాళి పకడ్బందీగా అమలు చేయడం జరుగుతుందని, 23 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 23 స్టాటిస్టికల్ సర్వయ్వల్ టీములు, 9 వీడియో వీవింగ్ టీములు క్షేత్రస్థాయిలో పనిచేస్తాయని, పారదర్శకంగా, ప్రశాంతమైన వాతావరణంలో జరిగే ఎన్నికల ప్రక్రియకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేయించుకోవాలని, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు ఓటు వేయాలని, ఓటు హక్కు అందరి బాధ్యత విజ్ఞప్తి చేశారు.

డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేష్ చంద్ర మాట్లాడుతూ…. ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే ప్రతి ఒక్కరికి నిబంధనలు వర్తిస్తాయని అన్నారు. ఎన్నికల ప్రక్రియకు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి తొమ్మిది చెక్ పోస్టుల ద్వారా పూర్తి నిఘా ఉంటుందని, నగదు, మద్యం అక్రమ రవాణా జరగకుండా, అలాగే గంజాయి, మత్తు పదార్థాల రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల దృష్ట్యా ప్రజలు ఆధారాలు లేకుండా 50 వేలకు మించి నగదుతో ప్రయాణించవద్దని, ప్రతిరోజు తనిఖీలలో జప్తు చేసిన సొమ్మును జిల్లాలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కమిటీకి అప్పగిస్తామని, ఆధారాలు సమర్పించి గ్రీవెన్స్ కమిటీ నగదు విడుదల చేస్తుందని తెలిపారు. తనిఖీల నిర్వణహలో ప్రతి పనిని వీడియోగ్రఫీ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *