ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గము నుంచి ఎం.పి. అభ్యర్థులుగా పోటీ చేయడానికి పలువురు ఆసక్తి

గౌరవనీయులు తెలుగు దేశం పార్టీ జాతీయ అద్యక్షులు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దివ్య సముఖమునకు, గౌరవనీయులు తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నార లోకేష్ బాబు గారి దివ్య సముఖమునకు , గౌరవనీయులు తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అద్యక్షులు శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు గారి దివ్య సముఖమునకు అయ్యా, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న మరియు మారుతున్న రాజకీయ పరిణామాలు మీ దృష్టికి తీసుకురావాలని తలుస్తున్నాను. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గము నుంచి ఎం.పి. అభ్యర్థులుగా పోటీ చేయడానికి పలువురు ఆసక్తి చూపుతున్నట్లు, వార్తాపత్రికల్లో వార్తలు వస్తున్న దరిమిలా, మండల పార్టీ అద్యక్షుల యొక్క భావాలు మీకు తెలియజేస్తున్నాము. ఏలూరు పార్లమెంట్ మాజీ సభ్యులు మాగంటి బాబు గారు వివాద రహితులు, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. వీరి కుటుంబం శతాబ్ద కాలంగా, సుమారు 104 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటూ, ప్రజాసేవకు అంకితమైన చరిత్ర వారిది. రాజకీయాన్ని అడ్డుపెట్టుకొని వీరి కుటుంబం ఏనాడు పైరవీలు కాని, కాంట్రాక్టులు కాని, అవినీతి కాని చేయని కుటుంబం వారిది. మాగంటి కుటుంబానికి జిల్లా వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఆయనపై అపారమైన సానుభూతి మరియు ప్రజాకర్షణ ఉన్నది. అన్ని రాజకీయ పార్టీలలో ఆయనకు అభిమానులు ఉన్నారు. ఇది మండల పార్టీ ప్రెసిడెంటులుగా మా సదాభిప్రాయం. గ్రామాలలో వారికి ఉన్న పరిచయాలు వారి తల్లిదండ్రుల కాలం నుంచి ఉన్న అభిమానులు నియోజకవర్గ పరిధిలో పార్టీకి ఎంతో లాభాన్ని చేకూరుస్తాయి. ప్రస్తుత రాజకీయ పరిస్తుతులలో మాగంటి బాబు గారు పార్టీకు ఎంతో అవసరమై వున్నది. మరియు వీరు ఏలూరు హెడ్ క్వార్టర్స్ లో నివాసం ఉంటూ ప్రతీ కార్యకర్తకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యను ఆయన పరిష్కరిస్తూ, ప్రజలకు, పార్టి కార్యకలపాలకు అందుబాటులో ఉంటున్నారు. ఏలూరు పార్లమెంట్ పరిధి లో ప్రతి ఒక్క కార్య కర్తను పేరు పేరున పిలువగల ఏకైక నాయకుడు మాగంటి బాబు గారు. ఏలూరు పార్లమెంట్ పరిధి లో యే కార్యకర్తకు ఎటువంటి కష్టం వచ్చిన ముందువరుసలో వుండి వారిని ఆదుకునేది ఆయనే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *