ప్రజా పాలనకు వంద రోజులు ప్రజానాయకునికి 100 ప్రశ్నలు మీడియా చిట్ చాట్ లో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

ప్రజాపాలనకు వందరోజులు ప్రజా నాయకునికి 100ప్రశ్నలు

N TODAY NEWS: భువనగిరి పట్టణం, మార్చ్ 26

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనకు వంద రోజులు ప్రజా నాయకునికి 100 ప్రశ్నలు అనే అంశంతో యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి లోని న్యూ దిప్తి హోటల్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఆలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు ప్రజలకు ప్రభుత్వనికి వారదిగ ఉన్న మీడియా మిత్రుల నుండి సుమారు 117 ప్రశ్నలు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యని అడిగారు.ఈ మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల సహకారంతో ఆలేరు నియోజకవర్గం లో చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు

ఆలేరు నియోజకవర్గంలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద 11 కోట్ల 39 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించి సిసి రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయడం జరిగింది.

ఆలేరు నియోజకవర్గంలో 15 కోట్లతో కొలనుపాక వయా జైన్ టెంపుల్ నుండి బచ్చన్నపేట డబుల్ లైన్ రోడ్డు పనులు ప్రారంభించడం జరిగింది.

ఆలేరు పట్టణంలోని 3.5 కోట్లతో కొలనుపాక రైల్వే అండర్ బ్రిడ్జి పనులు పై ప్రత్యేక చొరవ తీసుకొని వేగవంతం చేయడం జరిగింది.
DMF 2 ద్వారా రెండు కోట్ల 36 లక్షల రూపాయలతో నియోజకవర్గంలోని పలు గ్రామాలకు అంగన్వాడీ కేంద్రాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు సిసి రోడ్లను మంజూరు చేసి నిర్మాణాలు ప్రారంభించడం జరిగింది.

SDF నిధుల కింద కోటి 80 లక్షల రూపాయలతో నియోజకవర్గంలోని గ్రామాలకి మంచినీటి సరఫరా లో ఇబ్బందులు లేకుండా కొత్త బోర్లు మరియు మోటర్లు, మంచినీటి పైప్లైన్లు మంజూరు చేయడం జరిగింది.

SDF నిధుల ద్వారా 10 లక్షల రూపాయలతో రాజాపేట మండలం రఘునాథపురం, బసంతపూర్ గ్రామాలలో ఇండ్ల పై నుండి వెళ్తూ గ్రామ ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్న కరెంట్ లైన్లను మార్పించడానికి నిధులను మంజూరు చేయడం జరిగింది.
బొమ్మలరామారం మండల ప్రజల చిరకాల కోరిక మరియు ఎన్నో సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న జగదేవపూర్ పిడబ్ల్యు రోడ్డు to చీకటిమామిడి వయా వడపర్తి ఆర్ అండ్ బి డబుల్ లైన్ రోడ్డును 18 కోట్లతో మంజూరు చేసి పనులు ప్రారంభించడం జరిగింది.
తుర్కపల్లి మండలంలో ఎస్టీ ఎన్డీఎఫ్ నిధుల కింద 3 కోట్లతో జంగారెడ్డి కుంట తండా నుండి గుజ్జవానికుంట తండా మరియు పొట్టి మరి తండా నుండి నాగాయపల్లి వరకు బీటీ రోడ్డు పనులు మంజూరు చేయించి శంకుస్థాపన చేయడం జరిగింది.
మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడానికి స్థల సేకరణ పనులు వేగవంతం చేయవలసిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా తాత్కాలికంగా భువనగిరి పాత కలెక్టరేట్లో మెడికల్ కాలేజి నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది.

ఆలేరు నియోజకవర్గంలో 10 కోట్ల నిధులతో చెక్ డ్యాములు కట్టడానికి నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించడానికి ఏర్పాటు చేయడం జరిగింది.

బొమ్మలరామారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు HMDA నిధులు 20 కోట్లకు ప్రతిపాదనలు పంపగా, వాటికి ఆమోదం లభించింది త్వరలో ఆ పనులు ప్రారంభం కాబోతున్నాయి.
తుర్కపల్లి మండలంలో ఎస్టీ ఎన్డీఎఫ్ నిధుల కింద 3 కోట్లతో జంగారెడ్డి కుంట తండా నుండి గుజ్జవానికుంట తండా మరియు పొట్టి మరి తండా నుండి నాగాయపల్లి వరకు బీటీ రోడ్డు పనులు మంజూరు చేయించి శంకుస్థాపన చేయడం జరిగింది.

మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడానికి స్థల సేకరణ పనులు వేగవంతం చేయవలసిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది.

యాదగిరిగుట్టలో రోడ్డు విస్తరణలో షాపులు కోల్పోయిన బాధితులకు 185 మందికి కొండ కింద షాపులు కట్టి వాటికి పట్టా సర్టిఫికెట్లు ప్రదానం చేసి ప్రారంభించడం జరిగింది.

ఆలేరు నియోజకవర్గ పరిధిలో 50 కోట్లతో పంచాయతీరాజ్ రోడ్లకు ప్రపోజల్స్ తయారు చేసి పంపడం జరిగింది.
అదేవిధంగా 120 కోట్లతో R&B శాఖకు చెందిన రోడ్లు ప్రపోసల్స్ పంపించడం జరిగింది.
STSDF నిధుల కింద తుర్కపల్లి మండలంలో ధర్మారం టు బిలియా తండా వయా కాశర్ల గడ్డ తండా రోడ్డుని రెండున్నర కోట్లతో ప్రతిపాదనలు పంపించడం జరిగింది.

ఆలేరు నియోజకవర్గంలో తుర్కపల్లి మండలంలో మంచిరోని మామిల్లు, దయంబడ్డ తండా, ఆత్మకూరు మండలంలోని మోదుగుకుంట గ్రామంలో, రాజాపేట మండలం పుట్టగూడెం తండాలో సెల్ఫోన్ సిగ్నల్స్ లేక ప్రజల ఇబ్బందులను గమనించి ప్రత్యేకంగా సంబంధిత అధికారులతో మాట్లాడి టవర్స్ వేయడానికి అనుమతులు తీసుకురావడం జరిగింది.

గత 100 రోజుల ప్రజా పాలనలో ఆలేరు నియోజకవర్గం లోని 112 గ్రామాలు పర్యటించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది.
.మీడియా మిత్రులు ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా గంజాయి ని నిర్ములన చేపట్టాలని కోరగా పోలీస్ అధికారులతో మాట్లాడి ఎక్కడ కూడా గంజాయి లేకుండా చర్యలు చేపట్టేందుకు ఆదేశాలు ఇస్తామన్నారు.
.మీడియా మిత్రులకు వారి వారి మండలాల్లో రెవెన్యూ అధికారుల తో మాట్లాడి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు.
.ఎలక్షన్ కోడ్ అంతనరం నియోజకవర్గ వ్యాప్తంగా పల్లెనిద్ర చేసి ప్రజల సమస్యలు తెలుస్కుంటానని తెలిపారు.
.నియోజకవర్గ వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాలను నిర్మూలిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆడెం సంజీవరెడ్డి,ఆలేరు నియోజకవర్గంలోని వివిధ మండలాల ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *