మల్కాజిగిరి పార్లమెంటు అభివృద్దే నా ధ్యేయం- మల్కాజిగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి

మల్కాజిగిరి పార్లమెంటు అభివృద్దే నా ధ్యేయం- మల్కాజిగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి

N TODAY NEWS: ఎల్బీనగర్ నియోజకవర్గం, మార్చ్ 29

నాగోల్ డివిజన్ పరిధిలోని శ్రీ ఇంద్రప్రస్తా కాలనీ నందు మాతృభూమి ఉత్సవ సమితి మరియు సిటిజన్ డేవేలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో దాదాపు 23 కాలనీ వాసులకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పలువురు పలు సమస్యలను సుధీర్ రెడ్డి దృష్టికి మరియు ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా ఆనంద్ నగర్ నుంచి పతుళ్ళగూడ వైపు వెళ్లే దారి చిన్నగా ఉండడం వల్ల ఉదయం మరియు సాయంత్రం తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వడం జరుగుతుంది అని తెలిపారు.కావున రోడ్డు వెడల్పు చేయాలని కోరారు. అలాగే స్ట్రీట్ లైట్స్,నూతన మంచినీటి పైప్ లైన్స్ వ్యవస్థ,సీ.సీ.కెమెరాలు ఎర్పాటు చేయాలని కోరారు.అనంతరం సుదీర్ రెడ్డి మాట్లాడుతూ నూతన అదనపు మంచినీటి పైప్ లైన్స్,మరియు నూతన డ్రైన్స్ కోసం గతంలో వాటర్ వర్క్స్ ఏం.డి.గారిని కలవడం జరిగింది అని తెలిపారు.వారు అదనపు పైప్ లైన్స్ మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.మంచినీటి సౌకర్యం లేని శివారు కాలనీ వాసుల అందరికి నూతన వాటర్ పైప్ లైన్స్ వేయించడం జరుగుతుంది అని తెలిపారు.అలాగే స్ట్రీట్ లైట్స్,అదనపు డ్రైన్స్ వ్యవస్థ ఎర్పాటు చేయించడం జరుగుతుంది అని తెలిపారు.అలాగే రోడ్డు వెడల్పు విషయంలో సాధ్యాసాధ్యాలపై చర్చించి తగు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.ఇట్టి కార్యక్రమంలో ఎల్.బి.నగర్ నియోజకవర్గ భారస పార్టీ ఇంచార్జి ముద్దగోని రామ్మోహన్ గౌడ్,మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి,ఆనంతుల రాజిరెడ్డి,చెరుకు ప్రశాంత్ గౌడ్,డివిజన్ అధ్యక్షులు జక్కిడి మల్లారెడ్డి,చిరంజీవి,మహిళా అధ్యక్షురాలు ప్రమీల,మాజీ అధ్యక్షులు జగదీష్ యాదవ్,సతీశ్ యాదవ్,భాస్కర్ యాదవ్,జగదీష్ మరియు వాకర్స్ సభ్యులు విక్రమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *