జిల్లాల్లో 323 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేపట్టినట్లు తెలిపిన జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ పి. బెన్ షా లోమ్

N TODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా, ఏప్రిల్ 12

శనివారం నాడు ఆయన యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ళను వివరిస్తూ…85 ఐకేపి కేంద్రాలు, 225 పాక్స్ కేంద్రాలు, 13 FPO ల ద్వారా కొనుగోళ్లు చేయడం జరుగుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 32 కేంద్రాల ద్వారా 168 మంది రైతుల నుండి 29 కోట్ల విలువ చేసే 1330 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో అవసరమైన గన్ని సంచులు, టార్పాలిన్లు ఉన్నాయని, రైతులు నాణ్యతా ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కేంద్రాలకు తేవాలని ఈ సందర్బంగా కోరారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు సకాలంలో రవాణా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు, కొనుగోలు అనంతరం రైతుల ఖాతాలలో సకాలంలో డబ్బులు జమ చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *