కేంద్రంలో మూడోసారి భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం

ఎన్ టుడే న్యూస్ మునుగొడు ప్రతినిధి – కుర్మతి రమేష్

గట్టుప్పల్ మండల కేంద్రంలోని 191, 192 బూతులలో మహాజన సంపర్క అభియాన్ హర్ గర్ మోడీ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి పాల్గొని ఇంటింటికి తిరుగుతూ బూర నర్సయ్య గౌడ్ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మోడీ కేంద్రంలో మూడోసారి భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం ఓటర్లను అభ్యర్థిస్తూ ప్రచార నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చిలువేరు దుర్గయ్య, మండల అధ్యక్షుడు రావుల ఎల్లప్ప, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు చంపే దుర్గయ్య, మండల ఉపాధ్యక్షులు మారయ్య, జంపాల సుధాకర్, ప్రధాన కార్యదర్శిలుగా నాగుల గాని శ్రీను, కొంగర నరహరి, మండల కార్యదర్శులు పాండు మరియు బూత్ అధ్యక్షులు చేనేత సెల్ అధ్యక్షులు కొంగర పాండు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *