సర్వేలు గ్రామంలో బిజెపి ఆధ్వర్యంలో 82వ బూత్ అధ్యక్షులు కట్కూరి లింగస్వామి ఆధ్వర్యంలో

ఎన్ టుడే న్యూస్ మునుగోడు ప్రతినిధి – కుర్మతి రమేష్

సంస్థాన్ నారాయణపురం సర్వేలు గ్రామంలో ఈరోజు ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది
మూడవసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావడం ఖాయం
బిజెపి బూత్ అధ్యక్షులు కట్కూర్ లింగస్వామి
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని సర్వేలు గ్రామంలో బిజెపి ఆధ్వర్యంలో 82వ బూత్ అధ్యక్షులు కట్కూరి లింగస్వామి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అనంతరం ప్రచార కార్యక్రమంలో భాగంగా లింగస్వామి మాట్లాడుతూ భారత దేశంలో మూడోసారి నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తూ భారత ప్రధానమంత్రిగా చరిత్రలో నిలిచే విధంగా మూడో ప్రధానమంత్రి ఎన్నుకోవలసిన బాధ్యత బిజెపి కార్యకర్తలపై ఉందని అన్నారు భారతీయ జనతా పార్టీ అహర్నిశలు అన్ని రంగాల ప్రజలకు సరైనటువంటి న్యాయం చేయాలని సంకల్పంతో నేడు జరుగుతున్నటువంటి ఎన్నికల సమరంలో ఏకైక లక్ష్యంగా పనిచేస్తూ బూర నర్సయ్య గౌడ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి తన వానిని చట్టసభలలో వినిపించి సమస్యల పరిష్కారం కోసం అన్ని వర్గాల ప్రజల న్యాయం కోసం పోరాడుతూ భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలలో అభివృద్ధి పదం వైపు తీసుకెళ్లాలంటే కేవలం నరేంద్ర మోడీ మరియు బూర నర్సయ్య గౌడ్ వారితోటి సాధ్యమని అన్నారు రాష్ట్రంలో అన్ని పార్లమెంట్లలో స్థానాలు గెలిపించుకునేందుకు కంకణ బద్ధులై కార్యకర్తలు కృషితో పని చేస్తున్నారని తెలిపారు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో బిజెపి సత్తా చాటడానికి ముందు సాగాలని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *