భువనగిరి లోక్ సభ స్థానం కాంగ్రెస్ కే కంచుకోట- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

తెలంగాణ రాష్ట్రంలో రైతు బీమా, రైతుబంధు 7624 కోట్ల రూపాయలు విడుదల చేసాము

ఎన్ టుడే న్యూస్ మునుగోడు ప్రతినిధి – కుర్మతి రమేష్

యాదాద్రి భువనగిరి జిల్లాల లోని చౌటుప్పల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ క్యాంప్ ఆఫీస్ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్ల మాట్లాడుతూ. బిజెపి వ్యాపారుల పార్టీ
రైతుబంధు పథకం పై కొంతమంది ఫిర్యాదు చేశారు
భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ కు కంచుకోట సేవా భావం కలిగిన చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించండి బిజెపి వ్యాపారస్తుల పార్టీ బిజెపికి ఓటు వేస్తే వృధా అవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమాలు మాట్లాడారు. రాష్ట్రంలోని రైతాంగ సోదరులందరికీ అమల్లో ఉన్న రైతు బీమా, రైతు బంధం పథకం కింద 7624 కోట్లు రూపాయలు మంజూరు చేసాం. కొంతమంది సీఎం పైన ఫిర్యాదులతో అవి నిలిచిపోయాయి. భువనగిరి లోక్ సభ స్థానం ఎప్పుడూ కాంగ్రెస్ కు కంచుకోట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వం రావడానికి ఈ ప్రాంత ఓటర్లు అత్యధికమంది ఎమ్మెల్యేలను గెలిపించి పంపించారు. ఇందిరమ్మ ప్రభుత్వం మహిళలను మహారాణులుగా చూస్తుంది. డ్వాక్రా మహిళల కు అయిదు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణం కింద వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. గత ఏడాది డిసెంబర్ ఏడు నుంచి డ్వాక్రా మహిళ లకు వడ్డీలేని రుణాల కింద చెక్కులు పంపిణీ చేశాము అన్నారు. మూడు నెలల్లోనే 30వేల మంది నిరుద్యగులకు ఉద్యోగాలు కల్పించాం అన్నారు. మూసి కాలువలు మరమ్మతు చేయాలని నిర్ణయించి తెలిపారు. రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు బాగుండాలంటే భువనగిరి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఓవైపు, మోడీ అదానీ అంబానీ మరోవైపు నిలుచున్నారని తెలిపారు. ఈ దేశ సంపద ఇక్కడి ప్రజలకే పంచాలని రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసినట్టు తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు రిజర్వేషన్లు రద్దు చేసేందుకు 400 సీట్లు ఇవ్వాలని బిజెపి కోరుతుందని తెలిపారు. సేవా భావం కలిగిన వ్యక్తి యువజన సంఘంలో క్రియాశీలకంగా పనిచేసిన నాయకుడు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *