పేదలకు అందుబాటులో ఉండే చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుందాం– కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామిడి జంగారెడ్డి

NTODAY NEWS: బొమ్మలరామారం మండలం, మే 09

ఆలేరు నియోజకవర్గం, బొమ్మలరామారం మండలం, నాగినేనిపల్లి గ్రామంలో గురువారం రోజున కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి హస్తం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేయాలని రామిడి జంగారెడ్డి ఆధ్వర్యంలో వార్డులోని ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జంగారెడ్డి మాట్లాడుతూ ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా గెలిచిందో అదే మాదిరిగా దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేస్తుంది అని అన్నారు బిజెపి అభ్యర్థి, బిఆర్ఎస్ అభ్యర్థిలు ఎన్నికల సందర్భంగా ప్రజలలోకి వస్తున్నారు తప్ప ఎన్నికల తర్వాత ప్రజలు బిజెపి, బీఆర్ఎస్ అభ్యర్థులను ఎక్కడ ఉన్నారో వెతుక్కోవాలి పరిస్థితి ఉంటుంది అని అన్నారు పేద ప్రజలు అందుబాటులో ఉండే చామల కిరణ్ కుమార్ రెడ్డి గత 20 సంవత్సరాలుగా యువజన కాంగ్రెస్ లో పని చేస్తూ ప్రజా సమస్యలపై అవగాహన కలిగి ఉన్న నాయకుడు అని, ప్రజా సమస్యలను పరిష్కరించే నాయకుడు అలాంటి నాయకుడిని పార్లమెంట్ అభ్యర్థిగా మనం గెలిపించుకుంటే ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే కాంగ్రెస్, ఎంపీ కాంగ్రెస్ గా ఉండడం తో ఈప్రాంత అభివృద్ధికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి నూతన రేషన్ కార్డులు,ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు గాని, ఖాళీ స్థలం ఉన్నవారికి ఇండ్ల నిర్మించడం గాని, ఎస్సీ ఎస్టీ పథకాల ద్వారా నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించడంలో పూర్తిగా కెసిఆర్ ప్రభుత్వం విఫలం చెందింది అని అన్నారు దళిత బంధు ఇస్తానని చెప్పి ఎన్నికల సమయంలో అనేక మాయమాటలు చెప్పిన ప్రజలు కేసీఆర్ ను నమ్మలేదు ఇప్పుడు మళ్లీ అధికారం కోల్పోయిన వెంటనే కేసీఆర్ ప్రజల మధ్యకు వచ్చి అనేక మాయ మాటలు చెప్పిన ప్రజలు నమ్మే స్థితిలో లేరని బిజెపి ప్రభుత్వం 9 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉండి పేద ప్రజలుకు కనీస వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలం చెందారు అని అన్నారు వంట గ్యాస్ ధర, ఇంట్లో ఉండే నిత్యవసర సరుకుల ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు వివిధ వస్తువుల పైన అనేక జీఎస్టీ రూపంలో పెనుబారం మోపి పేద ప్రజలపై పెద్ద గుది బండగా బిజెపి ప్రభుత్వం వ్యవహరించింది అని గుర్తు చేశారు పేద ప్రజలకు ఇచ్చింది ఏమీ లేదని అన్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు పేద ప్రజలకు గ్రామాలలో ఉపాధి ఉండాలని జాతీయ గ్రామీణ ఉపాధి పథకం తీసుకొని వచ్చి పేద ప్రజలకు జీవితాల్లో వెలుగులు నింపిండాన్ని కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో ఉంటే పేద ప్రజల జీవితాలు బాగుపడతాయని అన్నారు ఈకార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రామిడి శ్రావణ్ ప్రసాద్ రెడ్డి, నాగినేనిపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు,నాయకులు ఎడ్ల అనంతరెడ్డి, ఇప్పలపల్లి స్వామి, పర్రె యాదగిరి, బాల్ రెడ్డి, ఇప్పలపల్లి మల్లేష్, బంటు నగేష్, శానూర్, రమేష్, నరేష్, బాబు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *