కల్తీ విత్తనాలు అమ్మితే.. పిడి యాక్ట్ పెడతామని జిల్లా వ్యవసాయ అధికారి కి అనురాధ డీలర్లని హెచ్చరించారు

ఎన్ టుడే న్యూస్ మునుగోడు ప్రతినిధి – కుర్మతి రమేష్

యాదాద్రి భువనగిరి జిల్లా లో చౌటుప్పల్ పూలపారక పరిధిలోని ఎరువుల దుకాణాల తనిఖీ చేశారు. జిల్లా వ్యవసాయ అధికారి కె. అనురాధ లో సబ్సిడీపై జీలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పత్తి విత్తనాలు
చౌటుప్పల్ విత్తన డీలర్లు కల్తీ విత్తనాలు అమ్మితే. చర్యలు తప్పవని. పీడి యాక్ట్ పెడతామని జిల్లా వ్యవసాయ అధికారి కె అనురాధ డీలర్లను హెచ్చరించారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని ఎరువుల, విత్తనాల డీలర్ల దుకాణాలను మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజుతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ జిల్లాలో సరిపడా విత్తనాలు, ఎరువులు ఉన్నాయన్నారు. వర్షాకాలం సీజన్ ప్రారంభమవుతున్నందున విత్తన కొనుగోలు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు. విత్తనాలను ఆదికృత విత్తన డీలర్ల దుకాణాలలో కొనుగోలు చేయాలని, కొన్న తర్వాత రశీదు ఖచ్చితంగా తీసుకోవాలన్నారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా దాదాపు 17వేల ఎకరాల్లో పత్తి సాగయ్యే అవకాశం ఉందని, అందుకు సరిపడా విత్తనాలు, ఎరువులు మండల కేంద్రంలో అందుబాటులో ఉన్నాయ అన్నారు. అదే విధంగా పిఎసిఎస్ కొనుగోలు చేసిన రైతులు ముఖ్యంగా కొనుగోలు చేసిన రశీదు తో పాటు విత్తన ప్యాకెట్లను జాగ్రత్త పరుచుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *