బూరుగుగూడెంలో టీడీపీ కి అన్ని ఓట్లు ఎందుకు వేశారంటే పొలాలకు వెళ్ళే దారులు మూయించడం రోడ్లు కు ఫెన్సింగ్ తీగలు కట్టించడం

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నూజివీడు శాసనసభా స్ధానానికి కూటమి ఉమ్మడి అభ్యర్థి గా పోటీ చేసిన కొలుసు పార్థసారధిపై చాట్రాయి మండల ప్రజలు పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.చాట్రాయి మండలం చాట్రాయి గ్రామానికి సంబంధించి బూత్ నెంబర్ 25 లో టిడిపికి 475 వైసీపీకి 320 ఓట్లు రాగా టీడీపీ కి 155 ఓట్లు మెజారిటీ బూతు నెంబర్ 26 లో టిడిపి కి 431 వైసీపీకి 290, రాగా టీడీపీ కి మెజారిటీ 141,బూత్ నెంబర్ 27 లో టిడిపికి 376 వైసీపీకి 353 రాగా, టీడీపీ కి మెజారిటీ 23, బూత్ నెంబర్ 28లో టిడిపికి 402 వైసిపీ కి 338 రాగా,టీడీపీ కి మెజారిటీ 64,ఓట్లు పడినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలియజేశారు మొత్తం టీడీపీ కి వైసీపీ కంటే అదనంగా 383 ఓట్లు నమోదైనవి.దీనితో చాట్రాయి మండలంలో మండల హెడ్క్వార్టరైన చాట్రాయిలో టిడిపికి అత్యధిక ఓట్లు నమోదై మండలం లో మొదటి స్ధానంలో నిలచింది ఈ ఘనత జిల్లా అధికార ప్రతినిధి మందపాటి బసవారెడ్డికే దక్కింది కాగా 18 గ్రామాలలో నరసింహారావుపాలెం, పర్వతాపురం, పోతనపల్లి, బూరుగుగూడెం, గ్రామాలలో మాత్రమే వైకాపాకు మెజారిటీ రాగా మిగిలిన 14 గ్రామాల్లో టిడిపి ఆదిక్యత కనబరిచింది. వైసీపీకి కంచు కోటగా ఉన్నటువంటి బూరుగుగూడెంలో 437, పర్వతాపురంలో 342, పోతనపల్లి లో 611ఓట్లు టీడీపీకి రావడం గమనార్హం. వైసిపి సీనియర్ నాయకుడు దేశిరెడ్డి రాఘవరెడ్డి స్వంత గ్రామమైన బూరుగుగూడెం గ్రామంలో టిడిపి నెమ్మదిగా పుంజుకుంటుంది దీనికి కారణం బూరుగుగూడెంలో పురాతనంగా 150,200 సంవత్సరాల నుండి పంట పొలాలోకి రాకపోకలకు దారులు ఉన్నటువంటి నేపథ్యంలో, ఇటీవల ఒక అసాంఘిక శక్తి బయలుదేరి అడ్డుపడి ఇది మా తాతది అని (వాళ్ళ తల్లి తాతది,ఇంకా వారసులు చాలామంది ఉన్నారు),మాకు భూమి తగ్గిందని,దారులు మూసివేయటం, సరిహద్దుదారులతో తగాదాలు పెట్టుకొనిగెట్లు దౌర్జన్యంగా కలుపుకోవటం, చెరువు నీటి పారుదల పంటకాలవలను పూడ్చి కలుపుకోవడం, రోడ్లను కలుపుకొని రోడ్లపైకి ఫెన్సింగ్ తీగ వేయటం, లాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ,ప్రతి దానికి ఆర్టిఐ యాక్ట్ ఉపయోగిస్తానని అధికారులను సహా బెదిరిస్తూ,నేను లా చేశాను నాకు చట్టం తెలుసు,నాకు పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు వాళ్ళ అండ నాకు వుంది అనుకుంటూ ఒక వ్యక్తి ప్రొద్దున లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు రాఘవరెడ్డి ఇంటిదగ్గర ఉండటంవలన దీనిని రాఘవరెడ్డి ఖండించకుండా సపోర్ట్ చేస్తున్నాడనే విమర్శలు రావడంతో ఇది ముఖ్య కారణంగా భావించవచ్చని విశ్లేషకుల అభిప్రాయం. రాఘవరెడ్డి ఈ విధంగా చేయటానికి కారణం తన రాజకీయ జీవితంలో పంచాయతీ బోర్డులో గాని మరి ఏ ఇతరత్రా తాను చేసిన తప్పు ఒప్పు లను ఆర్టీఐ యాక్ట్ ద్వారా బయటకు తీసి ప్రైవేటు కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతాను,పైకం రికవరీ చేపిస్తాను,నీ ఆస్తులపై ఎంక్వైరీ వేయిస్తాను అని బెదిరిస్తూ ఉండటంతో భయపడిపోయి కొంతకొంత అమౌంట్ లు కూడా ఇచ్చి జొజ్జర కొడుతున్న నేపథ్యం నెలకొందని విమర్శలు ఉన్నాయి.ఇదే పరిస్థితి కొనసాగినట్లయితే బూరుగుగూడెంలో రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో టిడిపి జెండా పాతే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.మండలంలో కూటమి అభ్యర్థి కొలుసు పార్థసారధికి 19430 ఓట్లు రాగా వైకాపా అభ్యర్థి మేకా వెంకట ప్రతాపప్పారావు 18385 ఓట్లకు పరిమితమయ్యారు.దీనితో చాట్రాయి మండలంలో 1045ఓట్లు మెజారిటీని టీడీపీ అభ్యర్థి సొంతం చేసుకున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *