తొలగించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి స్థానంలో ఉన్న సిమెంట్ దిమ్మెలను తొలగించి సర్వీసు రోడ్డును పొడిగించండి.. మాదాసు భాను ప్రసాద్, కన్వీనర్, ప్రజా మ్యానిఫెస్టో కమిటీ..

చిలకలూరిపేట నియోజకవర్గ (NTODAY NEWS) ప్రతినిధి-రావిపాటి రాజా….

చిలకలూరిపేట పట్టణం అడ్డరోడ్డు సెంటర్ లోని కళ్యాణి హోటల్ ఎదురుగా నేషనల్ హైవేపై గతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉండేది. ప్రజలు ఉపయోగించక పోవడము, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ప్రభుత్వము తొలగించింది. అయితే తొలగించిన ప్రదేశము లోని రోడ్డుపక్కనున్న సిమెంట్ దిమ్మలను తొలగించలేదు, మరియు ఆ ప్రాంతంలో సర్వీస్ రోడ్డు నిర్మించలేదు. అది నాలుగు రోడ్ల కూడలికి సమీపాన ఉండడంవలన ట్రాఫిక్ సమయంలో ప్రయాణీకులకు చాలా అసౌకర్యంగా ఉన్నది. కావున, హైవేకి ఇరువైపుల సుమారు వంద అడుగుల పొడవు ఉండే సర్వస్ రోడ్డు నిర్మించాల్సిందిగా ప్రజా మ్యానిఫెస్టో కమిటీ కన్వీనర్ మాదాసు భాను ప్రసాద్ కోరారు. అలాగే, ఏ.ఎమ్.జీ. నుండి గణపవరం వైపు సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయలేదు. నాదెండ్ల, గణపవరం వైపు నుండి డొంక రోడ్డులో నుండి పేట వైపు వచ్చే వాహనదారులు అపసవ్య దిశలో రావలసి వస్తుంది. అక్కడ కాలువకు మెయిన్ రోడ్డుకు మధ్యలో బోర్డులు, వాహనాలు, కర్రలు మొదలగునవి ఉండుట వలన వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. యాక్సిడెంట్స్ కూడా జరుగు తున్నాయి. కావున, అధికారులు స్పందించి సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకోవలసినదిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో కంద భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *