ఘనంగా పున్నా కైలాష్ నేత జన్మదిన వేడుకలు

ఎన్ టుడే న్యూస్ మునుగోడు ప్రతినిధి – కుర్మతి రమేష్

యాదాద్రి భువనగిరి జిల్లా లో సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోనీ స్థానిక ప్రభుత్వ హాస్పటల్ లో ఈరోజు కైలాష్ నేత వీరాభిమాని కైసర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కీలక పాత్ర పోషించిన ఉస్మానియ యూనివర్సిటీ విద్యార్ధి ఉద్యమ నాయకుడు మునుగోడు ముద్దు బిడ్డ టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పున్నా కైలాష్ నేత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కేకు కట్ చేసి హాస్పటల్ లో ఉన్న రోగులకు మరియు హాస్పటల్ సిబ్బందికి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఐఎన్టియుసి మునుగోడు నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి పగిళ్ళ నరేష్, ఎస్సీ సెల్ మండల నాయకుడు గోపాల్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు అందె నరేష్, అబ్బు, రాజు, అనిల్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *