ప్రభుత్వం మారినా బ్రతుకులు మారలేదు-ఎంపీపీ వైయస్సార్

NTODAY NEWS ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ

  • ఆరు నెలలుగా జీతాల్లేవు
  • నలుగుతున్న పారిశుధ్య కార్మికులు జీవితాలు
  • ఎస్‌టీవోలో చెక్కులు పెండింగ్‌
  • పుట్టెడు కష్టాల్లో సఫాయిలు
  • ప్రజల ఇంటి పన్నును వాడుకుంటున్న ప్రభుత్వం

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ ఔషపూర్ గ్రామంలో పారిశుద్ధ కార్మికులకు ఆరు నెలలుగా జీతాలు లేక అష్ట కష్టాలు పడుతున్నారని వారికి రాష్ట్ర ఎంపీల ఫోరం అధ్యక్షులు, ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు మద్దతు తెలిపి ధర్నాలో ధర్నాలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పారిశుద్ధ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వల బ్రతుకులు మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తూ పారిశుద్ధ కార్మికుల జీవితాలతో ఆటలాడుతున్నారని. డిప్యూటీ సీఎం, ఫైనాన్ శాఖ మంత్రులు బట్టి విక్రమార్క, పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు అనసూయ (సీతక్క) గారు వెంటనే స్పందించి పారిశుద్ధ కార్మికులకు జీతాలు అన్ని విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ గారు పై అధికారులు వెంటనే స్పందించి జీతాలు అన్ని విధంగా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు కొలిచిలిమి మల్లేష్, బిజెపి నాయకులు మచ్చేందర్ రెడ్డి, కాసుల వెంకటేష్ గౌడ్, పారిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *