ప‌రుగులు తీయ‌నున్న రాష్ట్ర అభివృద్ది

విద్వేషం.. విధ్వంసంతో ఓటమికి బాటలు

జ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటేల బాలాజి

చిలకలూరిపేట నియోజకవర్గ (NTODAY NEWS)ప్రతినిధి -రావిపాటి రాజా….

చిల‌క‌లూరిపేట‌:
రాష్ట్ర అభివృద్ధి ఇక నుంచి శ‌ర‌వేగంగా ప‌రుగులు పెట్ట‌నుంద‌ని, కూట‌మి ప్ర‌భుత్వం కొలువు తీర‌నున్న నేప‌థ్యంలో ప్ర‌మాణ‌స్వీకారం చేస్తున్న సీఎం చంద్ర‌బాబునాయుడు, జన‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు, ఎమ్మెల్యేలంద‌రికీ జన‌సేన సెంట్రెల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ పెంటేల బాలాజి శుభాకాంక్ష‌లు తెలిపారు. మంగ‌ళ‌వారం ఆయ‌న కార్యాల‌యంలో విలేక‌ర్ల‌తో బాలాజి మాట్లాడుతూ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా కూట‌మి పాల‌న కొన‌సాగ‌నుంద‌ని వెల్ల‌డించారు. ప్ర‌జాసంక్షేమం, అభివృద్ది రెండు క‌ళ్లుగా పాల‌న ఉండ‌బోతుంద‌ని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడమే తమ లక్ష్యంగా కూట‌మిగా ఎర్ప‌డిన పార్టీలు ప్ర‌జాభిష్టం మేర‌కు పాల‌న కొన‌సాగ‌నుంచ‌నున్నాయ‌ని వెల్ల‌డించారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు, విధ్వంస పాలనను సాగనంపేందుకు కూటమి ముందుకు వ‌చ్చిన విష‌యాన్ని బాలాజి గుర్తు చేశారు.
త‌ప్పులు చేస్తున్న‌ప్పుడు వ్య‌తిరేక‌త క‌నిపించ‌లేదా…2
త‌ప్పులు మీద త‌ప్పులు చేస్తూ నిరంకుశంగా పాల‌న కొన‌సాగిస్తే ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త రాకుండా ఉంటుందా? అని బాలాజి ప్ర‌శ్నించారు. ‘ప్రభుత్వ వ్యతిరేకత ఈ స్థాయిలో ఉందని గుర్తించలేకపోయాం’ అని ఎన్నికల్లో ఓటమిపాలయిన పలువురు వైసీసీ అభ్యర్థులు, వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇప్పుడు వాపోవ‌డం విచిత్ర‌మ‌న్నారు. ప్ర‌తి సంద‌ర్బంలోనూ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త తీవ్రంగా ఉండి, ప్ర‌జ‌లు రోడెక్కి నిర‌శ‌న వ్య‌క్తం చేస్తున్నా వైసీసీ నేత‌లు ప‌ట్టించుకోలేద‌న్నారు. జగన్‌ తనకు తానే భస్మాసుర హస్తమయ్యారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత అపూర్వ విజయాన్ని ప్రజలు 2019లో అందిస్తే.. హుందాగా స్వీకరించి ప్రజారంజక పాలన అందించి, అందరి మన్నన చూరగొనాల్సింది పోయి.. అధికారంతో విర్రవీగితే జనం ఎలా ఓటుతో బుద్ధి చెబుతారనేందుకు ఈ ఎన్నికల్లో జగన్‌ ఘోర పరాజయమే నిదర్శనం. జగన్‌ రివర్స్‌ పాలనతో విసిగిపోయిన జనం ఆయన అధికారాన్ని ఓటుతో రీకాల్‌ చేశారని మండి ప‌డ్డారు. 2019 ఎన్నికల ముందు పాదయాత్రతో ప్రజల్లో తిరిగిన జగన్‌…ఒక్క సారి అధికారంలోకొచ్చాక ఆ జనానికి దూరమయ్యారని వివ‌రించారు. . తాడేపల్లిలో ప్యాలెస్‌కు పరిమితమై రాచరిక పాలనకు శ్రీకారం చుట్టారని,. రాజకీయ అవసరాలరీత్యా తప్పనిసరి పరిస్థితుల్లో జిల్లాలకు వెళ్లాల్సి వచ్చినా పరదాల మాటున జనం కళ్లలో కూడా పడకుండా తప్పించుకుని తిరిగొచ్చారని తెలిపారు. అయిదేళ్లూ జనం వచ్చి తమ సమస్యలపై ముఖ్యమంత్రికి చెప్పుకొనే అవకాశాన్నే కల్పించలేదన్నారు. ఇంత‌టి వ్య‌తిరేక‌త మూట‌గ‌ట్టుకొన్న జ‌గ‌న్, అండ్‌కో ప్ర‌జ‌ల్లో ఇంత‌టి వ్య‌తిరేక‌త ఎలా వ‌చ్చింద‌ని అమాకంగా మాట్లాడం శోచ‌నీయమ‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *