రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికైన గ్రీన్ గ్రోవ్ విద్యార్థులు

NTODAYNEWS నల్గొండ జిల్లా చిట్యాల మండలం పరిధిలో ఉన్న గ్రీన్ గ్రోవ్ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యారు ఇందులో భాగంగా ఈనెల 20న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియంలో జరిగిన హాకీ జట్ల ఎంపికలలో చిట్యాల పట్టణానికి చెందిన గ్రీన్ గ్రోవ్ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనపరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు ఇందులో భాగంగా అండర్ 17 విభాగంలో కె అఖిల్ నందన్, పి అశ్విత, అండర్ 14 విభాగంలో కే నరేన్ కుమార్, ఎస్ యశ్వంత్ అండర్ 14 బాలికల విభాగంలో ఎస్ కే అయేషా, జే రమ్య హాకీ ఆటలు ఉత్తమ ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి విద్యార్థులనుబ్ ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడ వల్ల మానసిక శారీరక ఆరోగ్యం వస్తాయని భవిష్యత్తులో క్రీడల పట్ల ఉన్నత ఉద్యోగాలు మంచి అవకాశాలువ్సాధించుకోవచ్చని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ బండి వీణ అనిల్ కుమార్ రెడ్డి, పాఠశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోలా గోవర్ధన్ వ్యాయామ ఉపాధ్యాయులు గంగపురం రాము ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు హాకీ జట్టుకు ఎంపికైన విద్యార్థులను అభినందించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *